News

వైసీపీ అల్లరిపిల్ల మాదిరి:సుజన


సుజన చౌదరి ఎపిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ స్కూల్ లో  అల్లరిపిల్ల మాదిరి వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. కేంద్రం ప్యాకేజీ, ప్రత్యేక హోదా అంశాలపై విపక్షాలు విమర్శలు చేస్తున్న నేపద్యంలో ఆయన ఇలా అన్నారు. ఎపికి ఆర్దికసాయం ఇతరత్రా ప్యాకేజీ తీసుకు రావడానికి కృషి చేస్తున్నామని, తామేమీ ఇక్కడ డాన్స్ చేయడం లేదని ఆయన అన్నారు.కాని విపక్షం వాటిని పట్టించుకోకుండా స్కూల్ లో అల్లరి పిల్ల మాదిరిగా విపక్ష వైఎస్ ఆర్ కాంగ్రెస్ వ్యవహరిస్తోందని సుజన పేర్కొన్నారు. విపక్షం చెప్పినట్లు నడచుకోవడానికి తీర్పు ఇవ్వలేదని ఆయన అన్నారు. తమకు ప్రజలు ఐదేళ్లకు తీర్పు ఇచ్చారన్న సంగతిని గుర్తంచుకోవాలని అన్నారు.